Srinivas goud on Sports: తెలంగాణ రాష్ట్రానికి, దేశానికీ వన్నె తెచ్చే క్రీడాకారులను తయారుచేసే క్రీడా కర్మాగారంగా క్రీడా పాఠశాలలను తయారు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాపాలసీని రూపొందిస్తున్నామన్నారు. త్వరలో క్రీడాపాలసీ డ్రాఫ్ట్‌ను కేబినెట్లో ఆమోదం చేసుకొని దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని అమలు చేయబోతున్నామన్నారు. క్రీడాకారులను, కోచ్‌లకు ఈ పాలసీలో ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం కొవిడ్ కారణంగా 2021-22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.
Srinivas goud on Sports: 'క్రీడా పాఠశాలల్లో 240 సీట్ల భర్తీకి షెడ్యూల్' - telangana news
Srinivas goud on Sports: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని అమలు చేయబోతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హాకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో గల క్రీడా పాఠశాలల్లో 4వ, 5వ తరగతుల్లో 15 క్రీడా విభాగాలలో మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలు హాకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో 4వ, 5వ తరగతుల్లో 15 క్రీడా విభాగాలలో మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హాకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఉన్న క్రీడా పాఠశాలల్లో 4వ, 5వ తరగతుల్లో బాలుర, బాలికల కోసం 20సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్లు పారదర్శకంగా జరపాలని క్రీడా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: