మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెరాసలో మద్దతు పెరుగుతోంది. యువనేతకు సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరుగుతున్న వేళ మంత్రులు , ఎమ్మెల్యేలు సైతం మద్దతుగా గళం విప్పుతున్నారు. తాజాగా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అనే అంశంలో ఎంటువంటి దాపరికం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం అయితే సహచర మంత్రులుగా తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. తెరాస పార్టీ అంతర్గత వ్యవహారాలపై ప్రతిపక్షాల విమర్శలు భావ్యం కాదన్నారు.
'చిన్నపిల్లలకు కూడా తెలుసు... కేటీఆరే తర్వాత సీఎం అని'
కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అనే అంశంలో ఎటువంటి దాపరికం లేదని... మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వాన్ని, పాలనను విమర్శించే వారు.. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
'చిన్నపిల్లలకు కూడా తెలుసు... కేటీఆరే తర్వాత సీఎం అని'