సంప్రదాయ నృత్యాల వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో సంప్రదాయ నృత్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సద్గురు శ్రీ శివానంద నృత్యమాల డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తాం : శ్రీనివాస్ గౌడ్ - హైదరాబాద్
నేటితరం విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ.. సంస్కారం నేర్చుకోవడం లేదని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. అర్థం, పర్థం లేని పాటలకు జనాలు ఎక్కువ వస్తారు. కానీ పరమార్థం ఉన్న నృత్యాలకు ప్రజల నుంచి ఆదరణ కరవైందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తాం : శ్రీనివాస్‌గౌడ్
సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తాం : శ్రీనివాస్‌గౌడ్
ఇదీ చూడండి : 17 కేసుల్లో జైలుకెళ్లొచ్చి.. మళ్లీ దొంగతనం