ఏడో జాతీయ థాయ్ బాక్సింగ్ కప్ అండ్ ప్రో నైట్ ఫైట్ - 2021 ప్రోమో, బ్రోచర్‌లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
26 నుంచి బాక్సింగ్ కప్ అండ్ ప్రో నైట్: శ్రీనివాస్ గౌడ్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
జాతీయ థాయ్ బాక్సింగ్ కప్ అండ్ ప్రో నైట్ ఫైట్-2021ను విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ నెల 26 నుంచి మూడు రోజులు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈనెల 26 నుంచి బాక్సింగ్ కప్ అండ్ ప్రో నైట్: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈనెల 26 నుంచి 3 రోజుల పాటు జరిగే... ఈ పోటీలను బీ మీడియా, పాకో మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:'15న రైతు గర్జన పేరుతో బహిరంగ సభ'