తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister sinivas goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కలిసిన క్రీడాకారిణి గోలి శ్యామల

అమెరికాలో జరిగే లాంగ్ డిస్టెన్స్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఛాంపియన్​షిప్ పోటీలకు ఎంపికైన గోలి శ్యామల... మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కలిశారు. సీఎం కేసీఆర్​తో మాట్లాడి శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

By

Published : May 29, 2021, 5:44 PM IST

Updated : May 29, 2021, 7:23 PM IST

minister srinivas goud meet Athlete goli shyamala
క్రీడాకారిణి గోలి శ్యామలను కలిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

అమెరికాలో జరిగే లాంగ్ డిస్టెన్స్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఛాంపియన్​షిప్ పోటీలకు ఎంపికైనా నగరానికి చెందిన గోలి శ్యామలను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభినందించారు. లాస్‌ ఏంజిల్స్‌ నుంచి క్యాటలైన్‌ ఐలాండ్‌ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర 15 డిగ్రీల సెల్సీయస్‌ వాటర్‌లో జరిగే ఈ పోటీలకు శ్యామల ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఆయన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను ఆమె కలిశారు. ఈ కార్యక్రమంలో గోలి శ్యామలతో పాటు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో రూపొందించటానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. గోలి శ్యామల భవిష్యత్తులో లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్​లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున తనకు ఆర్థిక సాయం అందించాలని గోలి శ్యామల మంత్రికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

Last Updated : May 29, 2021, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details