గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో హెచ్‌సీఏ ఆటగాళ్ల కోసం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్రికెట్లో రాణించే యువతకు ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని హెచ్‌సీఏకు మంత్రి సూచించారు. హెచ్‌సీఏలో శిక్షణ పొందాలంటే గతంలో పైరవీలు చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రతిభకే అవకాశాలు దక్కుతాయని అన్నారు.