నిజాం పాలకులపై దండయాత్ర చేసిన స్వాతంత్య్ర యోధుడు, యుద్ధవీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బోరబండలో సర్దార్ పాపన్న గౌడ్ పేరిట నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఆయన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
'దేశం కోసం బ్రిటీష్ పాలకులను ఎదిరించిన యోధుడు సర్దార్ పాపన్నగౌడ్' - sardar papanna goud community hall in borabanda
భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలకులను ఎదిరించిన యోధుడు సర్ధార్ పాపన్నగౌడ్ అని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బోరబండలో కొత్తగా నిర్మించిన సర్దార్ పాపన్న గౌడ్ కమ్యూనిటీ హాల్‌తో పాటు ఆయన విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు.
సర్దార్ పాపన్న గౌడ్ కమ్యూనిటీ హాల్
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసిన మహానుభావుడి పేరుపై కమ్యూనిటీ హాల్‌ను నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పాల్గొన్నారు.