తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు అంతా చురుగ్గా పాల్గొన్నారని.. అదేవిధంగా వారు అన్ని రంగాల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతినిత్యం ఉద్యోగం చేయడంలో ఒత్తిడికి గురైన ఉద్యోగులు మానసిక శారీరక వికాసాలను అందించేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు.
పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శ్రీనివాస్ గౌడ్ - క్రికెట్ ఆడుతూ సందడి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని.. అందుకు ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టీఎన్జీవోల క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రికెట్ ఆడి సందడి చేశారు.
పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శ్రీనివాస్ గౌడ్
క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని.. దాదాపు 40 స్టేడియంలను కూడా నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారన్నారు. గురుకులాల్లో కూడా విద్యతో పాటు క్రీడా రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్