70 ఏళ్లల్లో ఏనాడూ ఉస్మానియాపై మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హంగామా చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారా అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు: శ్రీనివాస్ గౌడ్ - శ్రీనివాస్ గౌడ్ వార్తలు
ఉస్మానియా ఆస్పత్రిపై ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఎక్సైజ్, క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారా అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు: శ్రీనివాస్ గౌడ్
కేసీఆర్ 2015లోనే ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని ప్రతిపాదిస్తే.. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, ఉత్తమ్, భట్టి.. అందరూ వ్యతిరేకించారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతీ దానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో పోల్చి చులకనగా మాట్లాడుతున్నారని చెప్పారు. అభినృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్, భాజపా పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు.
ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!