Minister Srinivas Goud Fire on BJP: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని ప్రకటిస్తున్న విపక్ష నేతలకు ఆయన్ను ముట్టుకునే ధైర్యం ఉందా? అని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. కేసీఆర్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం యావత్తూ అట్టుడుకుతుందని హెచ్చరించారు.
తెలంగాణలో 70 ఏళ్లల్లో జరగని అభివృద్ధిని చేసినందుకు కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 317 జీవోను రద్దు చేయాలని భాజపా శ్రేణుల మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటలో రూ.41 కోట్లతో నిర్మించనున్న వారధితో కూడిన చెక్‌డ్యాం పనులకు బుధవారం భూమిపూజ చేసి మాట్లాడారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేసినందుకు, దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు పరుస్తునందుకు జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.