తెలంగాణ

telangana

ETV Bharat / state

Srinivas goud on Tourism: 'రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై వారానికొక వీడియో విడుదల చేస్తాం' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై వారానికొక వీడియో విడుదల చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud news) వెల్లడించారు. భూదాన్ పోచంపల్లి గ్రామానికి ఐరాస పర్యాటక ప్రాంతం గుర్తింపు(Bhoodan pochampally UN award) రావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు ప్రపంచ గుర్తింపు దక్కడంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవ ఉందని తెలిపారు.

Srinivas goud news, bhoodan pochampally un award
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్​మీట్, భూదాన్ పోచంపల్లికి ఐరాస అవార్డు

By

Published : Nov 17, 2021, 12:44 PM IST

Updated : Nov 17, 2021, 7:23 PM IST

ప్రపంచంలోనే గొప్ప పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లికి గుర్తింపు(Bhoodan pochampally UN award) రావడం సంతోషకరమని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud news) అన్నారు. యూఎన్​డబ్ల్యూటీవోకు(UNWTO) 70 దేశాల నుంచి 150 దరఖాస్తు వచ్చాయని... అందులో తెలంగాణ ప్రాంతంలోని భూదాన్ పోచంపల్లి అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్(CM KCR) ఆలోచనా విధానంతో మన ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. 800ఏళ్ల క్రితం కట్టిన రామప్పకు(Ramappa in telangana) ఇటీవలె యునెస్కో గుర్తింపు వచ్చిన అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. అదే 60ఏళ్ల క్రితమే ఆ గుర్తింపు వస్తే.. తాజ్ మహల్ మాదిరిగా ప్రసిద్ధిగాంచేదని ఆయన అభిప్రాయపడ్డారు.

తెరాస కృషి వల్లే..

ఎంతో చరిత్ర ఉన్న రామప్ప ఆలయానికి తెరాస హయాంలోనే యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చిందని అన్నారు. తెరాస ప్రభుత్వం కృషి వల్లే భూదాన్‌పోచంపల్లికి ఐరాస అవార్డు(bhoodan pochampally UN award) వచ్చిందని పేర్కొన్నారు. విశిష్ట కట్టడాలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. కానీ వాటి గుర్తింపు కోసం ఈ ప్రభుత్వం కృషి చేసిందని మంత్రి తెలిపారు. వందల ఏళ్లుగా ఉన్న రామప్ప ఆలయానికి ఇన్నాళ్లు గుర్తింపు రాలేదని మంత్రి అన్నారు.

ఇక్కత్​కు ఇంటర్నేషనల్ క్రేజ్

భూదాన్ పోచంపల్లి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియగా పేరుగాంచిందని... ఇక్కత్​కు(ikat weaving) ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని అన్నారు. ఇవే కాకుండా ఇంకా అరుదైన ప్రాంతాలు తెలంగాణ గడ్డపై అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతానికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదని విమర్శించారు. సమ్మక్క-సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందని.. కేంద్రం కూడా కనీసం రూ.100కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని.. సవతితల్లి ప్రేమ చూపించొద్దన్నారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మంత్రి వ్యాఖ్యానించారు. కనీసం పర్యాటక రంగానికి అయినా నిధులు కేటాయించాలని కోరారు.

అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసిన అరుదైన ఘనత భూదాన్‌పోచంపల్లికి ఉంది. పోచంపల్లి చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. రాష్ట్రాన్ని, దేశాన్ని 60 ఏళ్లు పాలించిన పార్టీలు మన ఘనతలు గుర్తించలేదు. తెరాస ప్రభుత్వం గుర్తించి ప్రతిపాదనలు పంపినందునే అవార్డులు వస్తున్నాయి. పర్యాటకాభివృద్ధికి రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సమ్మక్క- సారలమ్మ జాతరకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల చేయాలి. రామప్పకు గుర్తింపు వచ్చిందంటే ఇండియాకు కూడా ఘనత దక్కినట్లే. బుద్ధవనానికి కూడా త్వరలో యునెస్కో గుర్తింపు దక్కుతుంది. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై వారానికొక వీడియో విడుదల చేస్తాం.

-శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి

ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోన్న బెస్ట్ టూరిజం కాంటెస్ట్​లో భారత్​ నుంచి ఎంట్రీ సంపాదించిన మూడు గ్రామాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ఒకటి. గాజుల పోచంపల్లిగా ఉన్న ఈ గ్రామం.. భూదాన్ కార్యక్రమంతో భూదాన్ పోచంపల్లిగా పేరుగాంచింది. జిల్లా వ్యాప్తంగా.. 5,294 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంటే, అందులో సగం భూదాన్ పోచంపల్లిలోనే ఉన్నాయి. గ్రామ జనాభాలో 65 శాతం మంది చేనేత కార్మికులే ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధిక సంఖ్య పోచంపల్లిదే.

'రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై వారానికొక వీడియో విడుదల చేస్తాం'

ఇదీ చదవండి:dead body found in water: మానేరు వంతెన కింద మరో మృతదేహం లభ్యం

Last Updated : Nov 17, 2021, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details