హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సురభి కళాకారులు, పేదలు, కార్మికులకు క్రీడా, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు, దాతలు ఆదుకుంటున్నారని అన్నారు.
'సీఎం కేసీఆర్... ప్రజల పాలిట ఆపద్బాంధవుడు' - groceris to needy in hyd
ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు కరోనా కట్టడి చేస్తూనే.. మరోవైపు రైతులు, వివిధ వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని పర్యటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పేదలు, కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు.
minister srinivas goud distributed groceries to needy in Hyderabad
సీఎం కేసీఆర్... విపత్కర సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తూ నగదు బ్యాంక్లో జమ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఓవైపు కరోనాను కట్టడి చేస్తూనే... మరోవైపు రైతులను, వివిధ వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.