పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 1001సీడ్ గణేశ్ విగ్రహాలను క్రీడాకారులకు ఉచితంగా పంపిణీ చేశారు.
Srinivas Goud: 'పర్యావరణాన్ని పెంపొందించేందుకు సీడ్ గణేశ్‌లు' - సీడ్ గణేష్ విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీడ్ గణేశ్ విగ్రహాలను పంపిణిీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వెల్లడించారు. సీడ్ గణేశ్‌లను తయారు చేయించడం అభినందనీయమన్నారు.
సీడ్ గణేష్ విగ్రహాల పంపిణీ
సీడ్ గణేశ్‌లను తయారు చేయించడం అభినందనీయమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యావరణం పెంపొందించేందుకు సీడ్ గణేశ్‌లు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. సీడ్ గణేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి క్రీడాకారుడు సీడ్ గణేశ్‌లను పూజించి ఇంట్లోనే నిమజ్జనం చేయాలని కోరారు.
ఇదీ చూడండి:HIGH COURT: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు