భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. ఆమెను హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు.
గోలి శ్యామలను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్తలు
18 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహం అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
గోలి శ్యామల, మంత్రి శ్రీనివాస్ గౌడ్
పాక్ జలసంధిని ఈదిన రెండో మహిళగా శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమని మంత్రి కొనియాడారు. ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహం అందజేస్తుందని హామీ ఇచ్చారు. 47 ఏళ్ల వయసులోనూ పట్టుదలతో 18 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ స్విమ్మింగ్ కోచ్ ఆయుష్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి