Minister Srinivas Goud: 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు అఫిడవిట్లు సమర్పించినట్లు వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్రచేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించారని తెలిపారు. హైకోర్టు డిస్మిస్ చేసిన కేసులో తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల నాయకులంటే ఆ ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని ఆరోపించారు. నిజాయితీగా ఉద్యోగి స్థాయి నుంచి మంత్రి స్థాయికి వచ్చానని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.
'హైకోర్టు డిస్మిస్ చేసిన కేసులో నాపై ఆరోపణలు చేస్తారా?. కోర్టులో కేసు నడుస్తోందని అవాస్తవాలు రాశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి పేర్లను త్వరలోనే బయటపెడతాను. ఆధారాలతో సహా బయటపెట్టి వారి భరతం పడతాం.'