పారిశ్రామిక వేత్తలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసే వ్యాఖ్యలు పార్టీ పాలసీయా లేదా వ్యక్తిగత పాలసీయే చెప్పాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కష్టపడి ఎదిగిన బిడ్డ జూపల్లి అని కొనియాడారు. వేలాది మందికి ఉపాధికల్పించిన వారిని ఆరోపించడం సరికాదన్నారు.
అర్వింద్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు - పారిశ్రామిక వేత్తలపై ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు
దోచుకుపోయిన వాళ్లను వదిలేసి తెలంగాణ బిడ్డలపై బురదజల్లుతున్నారని ఎంపీ అర్వింద్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. అర్వింద్ ముందుగా పసుపు బోర్డు అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు.
'తెలంగాణ బిడ్డలపై బురదజల్లడం మంచిది కాదు'
పసుపు బోర్డు మీ పార్టీ ప్రధాన ఏజెండా అని, దాని కోసం కృషి చేయాలని తెలిపారు. ఐక్యంగా తెలంగాణ అభివృద్ధి గురించి పాటుపాడాలని కోరారు. వందలు వేల కోట్లు దోచుకెళ్లిన వారిని వదిలి పెట్టి, వ్యక్తిగతంగా బురదజల్లడం మంచిది కాదని హితవు పలికారు.
ఇదీ చూడండి :తెలంగాణపై కరోనా పంజా... పెరుగుతున్న కేసులు