గత సంవత్సరం పర్యాటక శాఖ అభివృద్ధిలో భాగస్వామ్యమైన సంస్థలు, ట్రావెల్స్ ను ఎంపిక చేసి అవార్డులు అందజేశామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మొత్తం 8 విభాగాల్లో ఈ అవార్డులను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. రవీంధ్రభారతీలో జరిగిన సమావేశంలో అవార్డుల వివారలను మంత్రి తెలియజేశారు.
పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
20:14 September 27
పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్-2020లో భాగంగా గ్రామీణ పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అవార్డులు అందజేశామన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌తో ఓ కమిటీని వేశామని.. అన్ని పరిశీలించి పర్యాటకశాఖలోని వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేశామన్నారు.
5 స్టార్ కేటగిరిలో ఫలక్ నామా ప్యాలెస్‌కు, 4 స్టార్‌లో కేటగిరిలో గోల్కోండ హోటల్, ఇతర విభాగంలో అలంకృత రిసార్ట్స్, 3 స్టార్ విభాగంలో రామోజీ ఫిల్మ్ సిటీలోని సితార హోటల్‌కు అందజేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి...ఆయన సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి :హేమంత్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా