తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 20న హైదరాబాద్​లో 'ఆటగదరా శివ' ప్రదర్శన - aata gatara Shiva program updates

విదేశాలల్లో భారతీయ వాయిద్యాలతో కచేరి తరహాలో ప్రదర్శించిన 'ఆటగదరా శివ' సంగీత కార్యక్రమాన్ని... ఇప్పుడు హైదరాబాద్​లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 20న హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో జరుగునుంది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సారథ్యంలో రూపొందించిన "ఆట కదరా శివ" సంగీత కార్యక్రమం బ్రోచర్​ను ఆవిష్కరించారు.

Srinivas Goud Aata Gadara Shiva brochure release
ఈనెల 20న హైదరాబాద్​లో 'ఆటగదరా శివ' ప్రదర్శన

By

Published : Feb 13, 2020, 1:39 PM IST

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సారథ్యంలో రూపొందించిన 'ఆట కదరా శివ' సంగీత కార్యక్రమం బ్రోచర్​ను రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి ప్రాంగణంలోని తాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఈనెల 20న హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో సాయంత్రం జరుగునుంది.

ఇవామ్ (ఐడబ్ల్యూఏయం) సాంస్కృతిక సంస్థ, తెలంగాణ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ అద్వర్యంలో తనికెళ్ళ భరణి సారథ్యంలో ప్రముఖ వీణ వాద్య కళాకారుడు శ్రీ తాళ్లూరి నాగరాజు సంగీతం దర్శకత్వంలో శ్రీమతి మణి నాగరాజ్ చేపట్టిన సంగీత కార్యక్రమమే 'ఆటగదరా శివ'. ఇందులోని అంశాలకు ఒక కూర్పు చేసి దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికా, దుబాయి లాంటి పలు దేశాలలో భారతీయ వాయిద్యాలతో కచేరి తరహాలో ప్రదర్శించిన 'ఆటగదరా శివ' కార్యక్రమాన్ని ... హైదరాబాద్​లో నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేళారు. 'ఆటగదరా శివ' అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఆధ్యాత్మిక పాఠకలోకానికి అందించాలని మంత్రి కోరారు.

ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం ఒక అంతర్జాతీయ స్థాయి సంగీత, కళాకారుల బృందంతో సింఫనీ తరహలో ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ఫ్లూట్ నాగరాజు, డ్రంప్ శివమణి తదితర ప్రసిద్ధ కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారన్నారని మంత్రి తెలిపారు.

ఈనెల 20న హైదరాబాద్​లో 'ఆటగదరా శివ' ప్రదర్శన

ఇదీ చదవండి:ఉత్తర్​ప్రదేశ్​ రోడ్డు ప్రమాదంలో 14కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details