తెలంగాణ

telangana

ETV Bharat / state

8 రోజులపాటు మంత్రి నిరంజన్​ రెడ్డి విదేశీ పర్యటన - రాష్ట్ర విత్తన రంగ అభివృద్ధి

తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి కోసం నేటి నుంచి 8 రోజులపాటు జర్మనీ, నెదర్లాండ్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించనున్నారు. విత్తన రంగం అభివృద్ధి, ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమ, వ్యవసాయ రంగ పథకాలు, పంటల సాగు విధానాలు, సహాకార సంఘాల వ్యవస్థపై మంత్రి బృందం పూర్తి అధ్యయనం చేయనుంది.

8 రోజులపాటు మంత్రి నిరంజన్​ రెడ్డి విదేశీ పర్యటన

By

Published : Oct 29, 2019, 5:07 AM IST

Updated : Oct 29, 2019, 7:42 AM IST

8 రోజులపాటు మంత్రి నిరంజన్​ రెడ్డి విదేశీ పర్యటన

రాష్ట్ర విత్తన రంగ అభివృద్ధి కోసం.. జర్మనీ, నెదర్లాండ్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇవాళ్టి నుంచి పర్యటించనున్నారు. ఇండో - జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్టు ద్వారా... జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ నుంచి మంత్రికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ మేరకు నేటి నుంచి నవంబర్‌ 6 వరకు 8 రోజులు ఆ దేశాల్లో మంత్రితోపాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, ఆలె వెంకటేశ్వర్​రెడ్డి పర్యటించనున్నారు. విత్తన రంగం అభివృద్ధి, ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమ, వ్యవసాయ రంగ పథకాలు, పంటల సాగు విధానాలు, సహాకార సంఘాల వ్యవస్థ తదితర అంశాలపై మంత్రి బృందం పూర్తి అధ్యయనం చేయనుంది.

ఈ పర్యటనలో భాగంగా ఆంస్టర్ డామ్‌లో ప్రసిద్ధిగాంచిన విత్తన వ్యాలీలో... కంపెనీలు, ప్రాసెసింగ్ సౌకర్యాలను మంత్రి నిరంజన్‌రెడ్డి బృందం సందర్శించనుంది. ఆధునిక వసతులతో నిర్మించిన విత్తన ధ్రువీకరణ ల్యాబ్‌ను సందర్శించనున్నారు. బెర్లిన్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను మంత్రి బృందం సందర్శించనుంది.

ఇవీ చూడండి: కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయండి: ఉత్తమ్

Last Updated : Oct 29, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details