తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ పుట్టినరోజును రైతు దినోత్సవంగా నిర్వహిస్తాం'

వ్యవసాయం, రైతాంగం పట్ల అనుకూల నిర్ణయాలు అమలు చేస్తున్న దృష్ట్యా... రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి ఏటా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం నాడు రైతు దినోత్సవంగా జరుపుతామని వెల్లడించారు.

minister singireddy niranjan reddy spoke on cm kcr birthday
'సీఎం కేసీఆర్​ పుట్టినరోజును రైతు దినోత్సవంగా నిర్వహిస్తాం'

By

Published : Feb 17, 2020, 3:29 PM IST

సీఎం కేసీఆర్ పుట్టినరోజును రైతు దినోత్సవంగా జరుపుతామని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 1.22 కోట్ల ఎకరాల్లో సాగు జరిగిందని... సీసీఐ కేంద్రాల ద్వారా 95 శాతం పంటలు కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ధాన్యం దిగుబడులు అద్భుతంగా ఉన్నాయన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. సంప్రదాయ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

96 కేంద్రాల ద్వారా కందులు కొనుగోలు చేశామని మంత్రి వెల్లడించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం.. కందులు కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.200 కోట్ల భారం పడుతోందని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు వెచ్చిస్తోందని మంత్రి నిరంజన్​రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అధికారులు దళారులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే జైలుకు పంపుతామని మంత్రి స్పష్టం చేశారు.

'సీఎం కేసీఆర్​ పుట్టినరోజును రైతు దినోత్సవంగా నిర్వహిస్తాం'

ఇవీ చూడండి: ప్రగతి భవన్​లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు

ABOUT THE AUTHOR

...view details