తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల మామిడి మార్కెట్‌కు త్వరలో శ్రీకారం: నిరంజన్‌రెడ్డి

జగిత్యాల మామిడి మార్కెట్​కు త్వరలో శ్రీకారం చుడతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి వెల్లడించారు. పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పంటల కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

minister singireddy niranjan reddy review
జగిత్యాల మామిడి మార్కెట్‌కు త్వరలో శ్రీకారం: నిరంజన్‌రెడ్డి

By

Published : Apr 2, 2021, 7:52 PM IST

రైతుల సౌకర్యార్థం జగిత్యాల మామిడి మార్కెట్‌కు త్వరలో శ్రీకారం చుట్టనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ మంత్రుల నివాస సముదాయంలో పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జగిత్యాలలో ముఖ్యమంత్రి మంజూరు చేసిన వాలంతరి సంస్థ 10 ఎకరాల స్థలంలో మామిడి మార్కెట్ అభివృద్ధి చేయనున్నామని మంత్రి తెలిపారు. తాండూరు రైతుబజార్‌ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌గా మార్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సకల సౌకర్యాలతో కొల్లాపూర్ మామిడి మార్కెట్... త్వరలో రైతులు, వ్యాపారులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సీజన్ నుంచే మామిడి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఈ ఏడాది యాసంగి పంటల కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు తమ వద్ద ఉన్న టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాలకు వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 6న సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఐటీ రంగంలో తెలంగాణ టాప్: కేటీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details