Minister Seethakka Review Meeting in Hyderabad : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా పరిస్థితిని ప్రతి రోజూ నిశితంగా పర్యవేక్షించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Minister Seethakka Review Meeting on Mission Bhagiratha : మిషన్ భగీరథశాఖ లక్ష్యాలు, కార్యకలాపాల గురించి పూర్తి స్థాయిలో ముఖ్య కార్యదర్శి స్మిత సభర్వాల్ మంత్రి సీతక్కకు వివరించారు. రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశించారు. రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ తాగు నీటి సరఫరా జరిగేలా చూడాలని సూచించారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క - ములుగులో సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు
Minister Seethakka Latest Meeting : రిజర్వాయర్లు, నదుల తదితర తాగునీటి వనరుల స్థాయిలు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క సూచించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని అన్నారు. ఏదైన సమస్య తలెత్తితే నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. భగీరథ ప్రాముఖ్యత(Importance of Mission Bhagiratha)పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్‌ఈలకు మంత్రి అనసూయ సూచించారు. గ్రామాల్లో తాగు నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు.