కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. హైదరాబాద్లోని మంత్రుల క్వార్టర్లలో గిరిజన, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖల, బాలల హక్కుల పరిరక్షణ సమితి కమిషన్ సభ్యులు మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో పనిచేయండి: మంత్రి - hyderabad neews
నూతన సంవత్సరం మరింత ఉత్సాహంగా పనిచేయాలని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్.. అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో మరింత బాధ్యతగా ఉండాలన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు కృషి చేయాలని మంత్రి వారికి సూచించారు. సీఎం ఎంట్రప్రిన్యుయార్షిప్ ఇన్నోవేషన్ స్కీమ్ ప్రకారం ఎక్కువ మందని పారిశ్రామికేవత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలని కోరారు. సమాజంలో మహిళలు, పిల్లలు, గిరిజనులు సగానికి పైగా ఉన్నారని... ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను వారికి చేరువ చేయడంలో మరింత బాధ్యతగా ఉండాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పట్ల నమ్మకాన్ని పెంచుతూ ప్రచారం జరగాలని తెలిపారు.
ఇదీ చూడండి:'కేంద్ర నిధులతోనే పంచాయతీల్లో అభివృద్ధి.. కేసీఆర్ ఇచ్చింది శూన్యం'