Minister Satyavati Rathod: గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం పెంచేలా ఆదివాసీల భవనాలు నిర్మించారు. రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు బీజేపీ ద్రోహం చేస్తోందని ఆరోపించారు. గిరిజనుల రిజర్వేషన్ పెంపుపై బీజేపీ తప్పుగా మాట్లాడుతూ.. అడ్డుకుంటోందని మండిపడ్డారు. తద్వారా గిరిజనులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఎస్టీల నుంచి లంబాడీలను తీసేయాలని ఎంపీ సోయం బాపూరావు అంటున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు.
గిరిజనులకు బీజేపీ ద్రోహం చేస్తోంది: సత్యవతి రాఠోడ్ - BJP betraying tribals in telangana
Minister Satyavati Rathod fire on BJP: రాష్ట్రంలో గిరజనుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తుంటే.. మరో పక్క బీజేపీ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు ద్రోహం చేస్తోందని మంత్రి సత్యవతి రాఠోడ్ మండిపడ్డారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ తప్పుగా మాట్లాడుతూ.. అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యవతి రాఠోడ్