అమీన్‌పూర్ ఘటన నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. అమీన్‌పూర్ కేసు విచారణ కమిటీ, అధికారులతో మంత్రి భేటీ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ హోమ్స్ అన్నింటినీ తనిఖీ చేయాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా వాటిని మూసివేయాలని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు.
'అమీన్‌పూర్ కేసు నిందుతులకు శిక్ష పడాల్సిందే' - satyavathi ratod
minister satyavathi ratod review on ameenpur case with investigation team
17:11 August 21
అమీన్‌పూర్ కేసు విచారణ కమిటీతో మంత్రి సత్యవతి రాఠోడ్ భేటీ
Last Updated : Aug 21, 2020, 5:59 PM IST