పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గిరిజన గురుకుల డిగ్రీ విద్యార్థులు బదావత్ సోని, రాఠోడ్ నరేశ్... దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
నిజామాబాద్‌కు చెందిన బదావత్ సోని తల్లిదండ్రులు ఆటో డ్రైవర్, దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదివిన సోని.. గిరిజన గురుకులంలో చదివి ఐఐఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ 2021-22కు సీటు సాధించిందన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన రాఠోడ్ నరేశ్ తల్లిదండ్రులిద్దరూ దినసరి వేతన కూలీలని... సంగారెడ్డిలోని జడ్పీ స్కూల్లో చదివి వైజాగ్ ఐఐఎంలో సీటు సాధించినట్లు తెలిపారు.