తెలంగాణ

telangana

ETV Bharat / state

Sathyavathi Rathod: వారిని ప్రభుత్వమే తల్లిదండ్రులుగా సంరక్షిస్తుంది: సత్యవతి రాఠోడ్

పిల్లల హక్కులు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(minister Satyavathi rathod) అన్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వెల్లడించారు. అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా సంరక్షిస్తుందని ఆమె అన్నారు. ఇవాళ బాలల దినోత్సవాన్ని(childrens day) పురస్కరించుకుని రాష్ట్రంలోని 33 జిల్లాలకు బాలరక్షక్‌(bala rakshak) వాహనాలను మంత్రి ప్రారంభించారు.

Minister Satyavathi rathod
బాలరక్షక్ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి సత్యవతి రాఠోడ్

By

Published : Nov 14, 2021, 8:05 PM IST

రాష్ట్రంలో ఆపదలో ఉన్న బాలలను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక బాలరక్షక్ (bala rakshak)వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్త్రీ, శిశు, మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(minister Satyavathi rathod) తెలిపారు. పిల్లల హక్కులను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎవరైనా 1098కి డయల్ చేస్తే తక్షణమే స్పందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక బాలరక్షక్ వాహనాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని జిల్లాలకు 33 రక్షక్‌ వాహనాలను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమంపై మంత్రి కేటీఆర్​తో(minmister Ktr) చర్చించినట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు బాలరక్షక్ (bala rakshak)వాహనం ఉండాలని సూచించినట్లు ఆమె పేర్కొన్నారు. తాము ధైర్యంగా ముందుకెళ్లేలా కేటీఆర్ ప్రోత్సహించారని వివరించారు.

బాలరక్షక్‌ వాహనాలు

కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చిన భారత్ పెట్రోలియం సంస్థకు మంత్రి సత్యవతి రాఠోడ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ వాహనాలు సమకూర్చడం కోసం ఎన్జీవోలను ప్రోత్సహించి, మార్గనిర్దేశనం చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సహకరించిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మల్లారెడ్డి యూనివర్శిటీ, మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాట్కో ఫార్మా లిమిటెడ్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పౌండేషన్, నిర్మాణ్ సంస్థ, ఐసీఐసీఐ ఫౌండేషన్, వారధి ఫౌండేషన్, సుమధుర ఫౌండేషన్, యశోదా ఫౌండేషన్, మిస్ ఇండియా మానస వారణాసి, డిఎంఎఫ్టీ నాగర్ కర్నూల్, సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ సంస్థలన్నిటికి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రతి మహిళకు బిడ్డ పుట్టినప్పుటి నుంచి జీవితంలో ఉన్నతంగా స్థిరపడి పెళ్లి అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు ఆమె వివరించారు. దేశంలో ఇలాంటి వినూత్న కార్యక్రమం ఇదే మొదటిదని ఆమె తెలిపారు. జాతీయ బాలల దినోత్సవం(childrens day) రోజున ఇవాళ రక్షక్‌ వాహనాలను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలకు ఉపయోగపడే ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభించడం నిజంగా సంతోషకరం. మంత్రి కేటీఆర్​తో చర్చించి ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాం. ప్రతి జిల్లాకు ఒక బాలరక్షక్ వాహనం ఉండాలనే కేటీఆర్​కు వివరించాం. మీరు వాహనాలు కొనండి అవసరమైతే నేను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వాహనాలను సమకూర్చిన భారత్ పెట్రోలియం యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అనేక మంది దాతలు కరోనా కష్టకాలంలో ముందుకొచ్చారు. దేశ పౌరులుగా ఎదిగే క్రమంలో పిల్లల సంరక్షణ, విద్య, రక్షణ కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. మన సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో, కార్పొరేట్ సంస్థల సహకారంతో పిల్లలందరీ తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు. కార్పొరేట్ వారి సాయంతో భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.-

సత్యవతి రాఠోడ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి

సత్యవతి రాఠోడ్

ఇదీ చూడండి:

Minister Satyavathi Rathod : 'మన బాలామృతాన్ని ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి'

ABOUT THE AUTHOR

...view details