దేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా తెలంగాణలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. అంగన్వాడీలో ఇప్పటికే 12 వేల భవనాలు ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరం మరికొన్ని భనవాలను నిర్మిస్తామని ప్రకటించారు. ఆ భవనాల నిర్మాణం కోసం ఎన్ఆర్జీఎస్ 5 లక్షలు, కేంద్రం లక్ష, రాష్ట్రం ఇచ్చే 2 లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు.
'అవకతవకలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం' - అంగన్వాడీలో బయోమెట్రిక్ విధానం
రాష్ట్రంలో అంగన్వాడీలో ఇప్పటికే 12 వేల భవనాలు ఉన్నాయని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఈ ఏడాది మరికొన్ని భనవాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. గుడ్ల పంపిణీ విషయంలో అవకతవకలపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
!['అవకతవకలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం' minister satyavathi rathod said we are always on the lookout for anganwadi fraud](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8818534-153-8818534-1600235512718.jpg)
'అవకతవకలపై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నాం'
'అవకతవకలపై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నాం'
అంగన్వాడీలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. పౌల్ట్రీ రైతుల నుంచి నేరుగా మక్కలు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించామని వెల్లడించారు. గుడ్ల పంపిణీ విషయంలో అవకతవకలపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు.
ఇదీ చూడండి :వాణిజ్య పన్నుల శాఖ పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు