రాష్ట్రంలో గురుకులాల్లో ప్రత్యక్ష బోధనకు హైకోర్టు అనుమతి తెలిపిన నేపథ్యంలో.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్ (minister satyavathi rathod) అధికారులకు సూచించారు (satyavathi rathod review on gurukulas reopen). కొవిడ్ వల్ల పాఠశాలలు మూతపడడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడిన విషయం మంత్రి ప్రస్తావించారు. గురుకులాల్లో చేరడానికి చాలా గిరాకీ ఉన్న దృష్ట్యా విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు (Minister Satyavathi Rathod review on accommodation arrangements in Gurukul).
విద్యార్థులను పాఠాశాలకు రప్పించే బాధ్యత వారిదే..
గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడెంలలో ప్రతి ఇంటికీ వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలన్నారు. ఏ ఒక్కరు పాఠశాలలో చేరకుండా ఉండొద్దని చెప్పారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలన్నారు. గిరిదర్శిని (giridarshini) కార్యక్రమంలో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొని విద్యార్థుల భవిష్యత్ కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో ఐసీడీఎస్ ఉద్యోగుల సేవలు ఇందుకోసం వినియోగించుకోవడంతో పాటు ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్వాడీ కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా వల్ల మూతపడ్డ విద్యా సంస్థల్లో నెల రోజులుగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నందున ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు (satyavathi rathod review on gurukulas reopen).