మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల క్యాలెండర్ను రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆవిష్కరించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మహిళా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సత్యవతి రాఠోడ్ - మంత్రి నివాసంలో క్యాలెండర్ ఆవిష్కరణ
మహిళా ఉద్యోగుల భద్రత, కార్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న సీఎం నిర్ణయంపై మంత్రి సత్యవతి రాఠోడ్ హర్షం వ్యక్తం చేశారు. టీఎన్జీవో సభ్యుల ఆధ్వర్యంలో మహిళాభివద్ధి, శిశుసంక్షేమశాఖ ఉద్యోగుల క్యాలెండర్ను మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు.
![మహిళా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సత్యవతి రాఠోడ్ minister satyavathi rathod inauguration of child and women welfare department calender at home in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10377325-434-10377325-1611583981155.jpg)
శిశుసంక్షేమశాఖ మహిళా ఉద్యోగుల క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యవతి రాఠోడ్
మహిళా ఉద్యోగుల భద్రత, కార్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న కేసిఆర్ నిర్ణయంపై మంత్రి, ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. మహిళల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్యోగులకు మంత్రి సూచించారు.