రాష్ట్ర గిరిజన గురుకుల విద్యార్థులు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింప చేస్తూ... తమ సత్తా చాటుకుంటున్నారు. గిరిజన గురుకులాల్లోని 36 మంది డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు దేశంలో ప్రతిష్ఠ కలిగిన విద్యా సంస్థల్లో సీట్లు సాధించుకున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. ఆగాఖాన్ ఫౌండేషన్, అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, ఎన్ఐటీ, ఐఐటీ, కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వంటి పేరెన్నిక గల సంస్థల్లో గిరిజన గురుకులాల విద్యార్థులు సీట్లు సాధించారని మంత్రి వివరించారు.
'రాష్ట్ర ప్రతిష్ఠను గురుకుల విద్యార్థులు పెంపొదిస్తున్నారు' - gurukula students news
గిరిజన గురుకులాల్లోని డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు దేశంలో ప్రతిష్ఠ కలిగిన విద్యా సంస్థల్లో సీట్లు సాధించుకున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. అత్యుత్తమ సంస్థల్లో సీట్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
minister satvavathi ratod complements gurukula students
అత్యుత్తమ సంస్థల్లో సీట్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యతతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం కేసిఆర్... దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ విద్యార్థులంటే ప్రపంచంలో ఎవరికీ తీసిపోకుండా ఉండాలని, ఏ పోటీ పరీక్షలోనైనా రాష్ట్ర విద్యార్థులు ముందంజలో ఉండాలనే సంకల్పంతో గురుకులాలను ఎంత ఖర్చైనా వెనుకాడకుండా నడిపిస్తున్నారని మంత్రి వివరించారు.