కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే పరీక్షలకు పూర్తిగా సన్నద్ధం అయ్యారని.. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేస్తే వాళ్లంతా ఆందోళన చెందుతారని మంత్రి వివరించారు. తగు చర్యలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
'అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం... నిశ్చింతగా పరీక్షలు రాయండి'
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పరీక్ష హాల్లోకి మాస్కులు, శానిటైజర్లు తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని బోరబండ, యూసఫ్‌గూడలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను మంత్రి పరిశీలించారు.
sabitha
హైదరాబాద్‌లోని బోరబండ, యూసఫ్‌గూడలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను మంత్రి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. సౌకర్యాల గురించి అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా.. పరీక్షలు బాగా రాయాలని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 16కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు