తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2020, 3:10 PM IST

ETV Bharat / state

త్వరలో ఆంగ్లం, ఉర్దూ మీడియంలో విద్యా బోధన: మంత్రి సబిత

రాష్ట్ర ప్రభుత్వం దూరదర్శన్ ద్వారా నిర్వహిస్తున్న విద్యా బోధనకు మంచి స్పందన లభిస్తోందని.. త్వరలోనే ఆంగ్లం, ఉర్దూ మీడియం తరగతులకు దూరదర్శన్ ద్వారా బోధన నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయినా యువత గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదవాలని మంత్రి సబితా సూచించారు.

త్వరలో ఆంగ్లం, ఉర్దూ మీడియంలో విద్యా బోధన: మంత్రి సబితా
త్వరలో ఆంగ్లం, ఉర్దూ మీడియంలో విద్యా బోధన: మంత్రి సబితా

రాష్ట్ర ప్రభుత్వం దూరదర్శన్ ద్వారా నిర్వహిస్తున్న విద్యా బోధనకు మంచి స్పందన లభిస్తోందని.. త్వరలోనే ఆంగ్లం, ఉర్దూ మీడియం తరగతులకు దూరదర్శన్ ద్వారా బోధన నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని చిల్కానగర్ డివిజన్‌లో సుమారు రూ. కోటితో నిర్మిస్తున్న గ్రంథాలయం భవన నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సుభాశ్‌ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అయినా యువత గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదవాలని మంత్రి సబితా సూచించారు. గ్రంథాలయ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజవర్గంలో గ్రంథాలయ అభివృద్ధి కోసం సుమారు రూ. 25 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ తరగతుల కోసం టీవీలు పంపిణీ చేసిన మంత్రి సబిత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details