ప్రభుత్వ పాఠశాలల్లో 30నుంచి 40శాతం వరకు విద్యార్థులు హాజరయ్యారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) వెల్లడించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కొవిడ్(covid) నిబంధనలు పాటించాలని సూచించామని విద్యామంత్రి పేర్కొన్నారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను నగరంలో అయితే జీహెచ్‌ఎంసీ(ghmc)... గ్రామాల్లో గ్రామపంచాయతీ, పట్టణాల్లో మున్సిపాలిటీలు కల్పిస్తున్నాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్షబోధన(physical classes) నేపథ్యంలో... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra reddy) హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఆకస్మిక తనిఖీ చేశారు.
పాఠశాలలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.... తరగతుల నిర్వహణపై(schools reopen) విద్యార్థులు, తల్లిదండ్రుల స్పందనను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కొవిడ్(covid) నిబంధనలు పాటించేలా... చర్యలు తీసుకుకోవాలని అధికారులను ఆదేశించారు. జూలై నుంచి ఇప్పటివరకు ఒక లక్షా 20వేల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యామంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో 10 నుంచి 12వ తరగతి విద్యార్థులు 60లక్షల వరకు ఉంటారని... అందులో 29నుంచి 30శాతం మంది విద్యార్థులు ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివేవారే ఉన్నారని మంత్రి వివరించారు. న్యాయస్థానం కూడా గురుకుల పాఠశాలలు మినహాయించి ప్రత్యక్ష బోధన చేయాలని సూచించిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయంలో కచ్చితంగా పక్కనే ఉండి చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని మంత్రి సూచించారు.