తెలంగాణ

telangana

ETV Bharat / state

'చెరువులు, కుంటల కబ్జాకు పాల్పడితే సహించేది లేదు' - Minister sabitha indra reddy visited Jalpalli municipality

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. భారీ వర్షాలకు చెరువులకు గండిపడి నీరు రోడ్లపై చేరిందని తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

'చెరువులు, కుంటల కబ్జాకు పాల్పడితే సహించేది లేదు'
'చెరువులు, కుంటల కబ్జాకు పాల్పడితే సహించేది లేదు'

By

Published : Sep 23, 2020, 6:04 PM IST

ఎవరైనా... చెరువులు, కుంటలు కబ్జాకు పాల్పడితే సహించేది లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. భారీ వర్షాలకు చెరువులకు గండిపడి నీరు రోడ్లపై చేరిందని తెలుసుకొని ఆ ప్రాంతాల్లో పర్యటించారు.

మంత్రితో పాటు మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, మున్సిపల్ కమిషనర్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు ఉన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులు ఆదేశించారు.

ఇదీ చూడండి: ఏసీపీ నివాసాల్లో తనిఖీలు... రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details