తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యారంగానికి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావట్లే.. : మంత్రి సబితా.. - Sabitha Indra Reddy participate teachers day

Sabitha Indra Reddy: సమాజాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొవిడ్ సమయంలో విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ గురువులను మంత్రి సబితా సత్కరించారు.

Sabita Indra Reddy
సబితా ఇంద్రారెడ్డి

By

Published : Sep 5, 2022, 2:05 PM IST

Sabitha Indra Reddy: సమాజాన్ని గొప్పగా నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఉత్తమ గురువులను మంత్రి సబితా సత్కరించారు. సమాజంలో డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సబితా సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

"మన సంప్రదాయాలను, సంస్కృతి నైతిక విలువను బోధించేది ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో కన్న ఎక్కువ సమయం విద్యార్థులు మీతోనే ఉంటారు . విద్యలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నాం. విద్యార్థి సర్టిఫికెట్ తీసుకొని బయటకు వెళ్లితే కచ్చితంగా ఉద్యోగం దొరుకుతుందనే భరోసా ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు డిమాండ్ ఉన్న కోర్సులు ప్రవేశపెడుతున్నాం. రాష్ట్రప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంది. ఇంత చేసిన కేంద్రం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు. అందుకనుగుణంగా నిధులు విడుదల చేయడం లేదు." - సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి

సమాజాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉంది:సబితా ఇంద్రారెడ్డి

ABOUT THE AUTHOR

...view details