పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బోరబండ, యూసూఫ్ గూడలోని పరీక్షా కేంద్రాలను మంత్రి పరిశీలించారు. సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
కరోనా ఎఫెక్ట్: పది పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు - కరోనా లక్షణాలు
కరోనా వైరస్‌ను నియంత్రించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బోరబండ, యూసఫ్‌గూడలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.
'వైరస్ వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ చర్యలు'
ఒత్తిడికి లోనవకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన చర్యలు చేపట్టామంటున్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో ముఖాముఖి.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్
Last Updated : Mar 20, 2020, 1:30 PM IST