ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిచాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్ సరూర్నగర్ సర్కిల్లోని కామేశ్వరరావు కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు.
బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి - బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ సరూర్నగర్ సర్కిల్లోని కామేశ్వరరావు కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
Hyderabad Latest news
నిరుపేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సంకల్పంతో జీహెచ్ఎంసీ పరిధిలో.... 123బస్తీ దవాఖానాలు ప్రతి రోజు 10వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. కొత్తగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో.... అదనంగా 4వేల మందికి వైద్య సేవలు అందనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు స్థానిక కార్పొరేటరు, పలువురు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.