నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి - Minister Sabitha Indra Reddy latest news
కరోనా నియంత్రణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్, స్థానిక కార్పొరేటర్ అర్జున్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
minister sabitha indra reddy latest news
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్, స్థానిక కార్పొరేటర్ అర్జున్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 150 మంది దివ్యాంగులు, 50 మంది పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ సిబ్బందికి ఎనిమిది రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రహిం శేఖర్, కమిషనర్ సత్యబాబు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.