పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ సరూర్నగర్లో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 38 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
'పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసదే' - షాధీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ సరూర్నగర్లో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 38 మందికి చెక్కులు అందజేశారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసకే దక్కిందని పేర్కొన్నారు.
!['పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసదే' minister sabitha indra reddy distribute kalyana laxmi-shadi mubarak-cheques hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9086889-634-9086889-1602074541947.jpg)
'పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసదే'
కరోనా వైరస్ కారణంగా భౌతిక దూరం పాటిస్తూ లబ్ధిదారులు చెక్కులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.