రాబోయే ఎన్నికల్లో తెదేపాకు బాదుడే బాదుడు: రోజా బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నిరకాల ఛార్జీలు పెంచేసి, ఇప్పుడు చంద్రబాబు నిరసనలకు సిద్ధం కావడం సరికాదన్నారు. ఇలాగే చేస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి పరాజయం తప్పదన్నారు. గతంలో నరకాసుర ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టే ప్రజలు చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారన్నారు.
ఈనెల 5న విద్యాదీవెన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి జగన్ తిరుపతికి వస్తున్న సందర్భంగా.. తారకరామ స్టేడియంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డితో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు.
'ఇక రేపటి నుంచి బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పడం చూసి అందరు నవ్వుకుంటున్నారు. కానీ ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి... దాని మనుగడ కోసం కొంచెం పెంచితే నానా యాగి చేస్తున్నారు. డిస్కంలు ఏ విధంగా నష్టాల్లో కూరుకుపోతే.. వాటి మనుగడ కోసం కొంచెం పెంచితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. వ్యాట్ పెంచారు. కానీ ఏ రోజైనా జగన్ గారు ఇచ్చే పథకాల్లో ఏమైనా ఇచ్చారా అంటే శూన్యం. అందుకే లోకల్ బాడి ఎన్నిక్లో బాదిన బాదుడికి అడ్రస్ లేకుండా పోయారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తెలుగు దేశం పార్టీని బాదుడే బాదుడని బాదేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా...'
- రోజా, మంత్రి
ఇవీ చూడండి: