తెలంగాణ

telangana

ETV Bharat / state

వారాహితో వస్తే.. పవన్​కు భయపడే వాళ్లు ఎవరూ లేరు: రోజా - rk roja dance in visakha

ROJA FIRES ON PAWAN: వారాహి వాహనంతో యుద్ధానికి వస్తే పవన్‌ కల్యాణ్‌కు భయపడేవారు ఎవరూ లేరని.. ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా అన్నారు. జనసేన పార్టీ కంటెంట్​లేని అట్టర్‌ ప్లాప్‌ సినిమాలాంటిదన్న ఆమె.. ప్రజలు జగన్‌వైపే ఉన్నారని చెప్పారు. విశాఖ వీఎమ్​ఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని.. జానపద పాటలకు నృత్యం చేశారు.

roja dance
రోజా నృత్యం

By

Published : Dec 14, 2022, 1:11 PM IST

ROJA FIRES ON PAWAN : వారాహి పేరు చెప్పి పవన్ కల్యాణ్​ వస్తే భయపడే వాళ్లు.. ఎవరూ లేరని ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మంచి కంటెంట్ లేకపోతే సినిమా ఎలా ఫ్లాప్ అవుతుందో.. జనసేన కూడా అలాగే ఫ్లాప్ అవుతుందని విమర్శించారు. పవన్ వేరే పార్టీ జెండా మోస్తుంటే చూసి జనాలు నవ్వుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వీకెండ్​లో వచ్చి రెండు ట్వీట్లు పెట్టి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.

40ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచి సంక్షేమ పథకం అమలుచేశారా అని నిలదీశారు. చంద్రబాబును ఎవ్వరు పట్టించుకోవడం లేదని.. ప్రధాని మోదీతో సహా మిగిలిన రాష్ట్రాల నాయకులు జగనన్న పథకాలను అనుసరిస్తున్నారన్నారు. సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడని.. అందుకే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారని తెలిపారు.

ROJA DANCE: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ వీఎమ్​ఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా మంత్రి ఆర్​.కె. రోజా పాల్గొన్నారు. గిరిజనులు సంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలతో రోజాకు స్వాగతం పలికారు. సభా వేదికపై గిరిజన జానపద గీతానికి నృత్యం చేసిన రోజా.. అనంతరం కళాకారులకు ప్రశంస పత్రాలను అందించారు.

రోజా నృత్యం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details