కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఉదయం మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆయన సతీమణి నీరజారెడ్డి కొవిడ్ టీకా తీసుకున్నారు.
అపోహలు వద్దు... ప్రతి ఒక్కరూ టీకా తీసుకోండి: ప్రశాంత్ రెడ్డి - nims vaccination news
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవాళ నిమ్స్ ఆసుపత్రిలో ఆయన టీకా తీసుకున్నారు.
టీకా తీసుకున్న ప్రశాంత్ రెడ్డి
వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు టీకా తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి:'కరోనా రెండో దశ వ్యాపిస్తోంది... అప్రమత్తంగా ఉండాలి'