ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని సభావ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సీఎస్ సహా.. ఉన్నతాధికారులతో భేటీకి మంత్రి హాజరయ్యారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సీఎస్ నేతృత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని వివరించారు. పార్లమెంట్ మార్గదర్శకాలు పాటిస్తూ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీ-మండలి హాల్‌లో ఆరడుగుల దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేశామన్నారు. శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.