రాష్ట్రంలో ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎన్.హెచ్-65పై కంకోల్ టోల్గేట్ వద్ద ట్రాఫిక్ రద్దీ అంశంపై ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి వేముల సమాధానమిచ్చారు. ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ వినియోగించడం ద్వారా దేశంలోని జాతీయ రహదారులన్నింటికీ ఏకీకృత టోల్ వసూలు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ విధానం అమలు పురోగతిలో ఉందన్నారు.
ఒక కి.మీ.28/2 నుంచి 235/058 కి.మీ. వరకు, హైదరాబాదు-కరీంనగర్-రామగుండం (హెచ్.కె.ఆర్) రోడ్డు. కి.మీ. 0/000 ల నుంచి 212 కి.మీ. వరకు. నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల (ఎన్.ఎం)రోడ్డు వరకు ఫాస్టాగ్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్.హెచ్-65పై కంకోల్ టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందని.. ఆ ట్రాఫిక్ డిమాండ్‌ను భరించడానికి ప్రస్తుతం సరిపోయినన్ని టోల్లేన్లు లేవన్నారు.