Prashanth Reddy reviewed with officials: రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి సంబంధించి మౌళిక సదుపాయ పనులు.. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత‌్వ కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి దృశ్యమాధ్యమం ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. రెండు పడకల గదుల ఇళ్ల పథకం ముఖ్యమంత్రి కేసీఆర్కు మానస పుత్రిక అన్న ప్రశాంత్ రెడ్డి.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పథకం లేదని కొనియాడారు.
నిర్మాణ తుది దశలో ఉన్న ఇళ్లు వెంటనే పూర్తి చేయాలని.. మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ఇళ్లు అందేలా చూడాలన్నారు. పోడు భూముల సర్వే పూర్తి చేసి గ్రామ సభలు నిర్వహించాలని నిర్దేశించారు. సబ్ డివిజినల్ సమావేశాలను కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు వేగంగా ముగించాలని.. 58,59 జీవోల కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాంచారు.