తెలంగాణ

telangana

ETV Bharat / state

'టౌన్​షిప్​ ప్లాట్ల అమ్మకానికి విధివిధానాలు ఖరాలు చేయండి' - twonship plots news

బండ్లగూడ, పోచారం టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకంపై హైదరాబాద్​లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి సమీక్ష సమావేసశం నిర్వహించారు. సమావేశంలో బండ్లగూడ, పోచారం టౌన్​షిప్​లో ఉన్న ప్లాట్లు అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం ఉందో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు.

minister prashanth reddy review on rajeev swagruha houses
'టౌన్​షిప్​ ప్లాట్ల అమ్మకానికి విధివిధానాలు ఖరాలు చేయండి'

By

Published : Jul 24, 2020, 10:54 PM IST

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన బండ్లగూడ, పోచారం టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్​లోని మంత్రి అధికారిక నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో బండ్లగూడ, పోచారం టౌన్​షిప్​లో ఉన్న ప్లాట్లు అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం ఉందో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. గృహాల అమ్మకం విలువలు ఇంకా కొంత మెరుగుపరిచి, బహిరంగ మార్కెట్​లో అర్థవంతమైన ధర పలికే విధంగా అంచనా విలువలు సరి చేయాలని అధికారులకు, వాల్యుయర్స్ సంస్థకు మంత్రి సూచించారు.

ఇదీ చదవండి:ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం

ABOUT THE AUTHOR

...view details