సమీకృత కలెక్టరేట్ భవనాలు వెంటనే పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నిర్మాణాల పురోగతిపై ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న సిద్దిపేట కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశముందని... ఆలోపు పనులు పూర్తిచేయాలని మంత్రి తెలిపారు.మొత్తం 26 జిల్లాల్లో.. ఒక్కోటి దాదాపు లక్ష 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని... ఈనెల 28 లోపు వాటిని ప్రారంభించుకోవడానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వరంగల్ అర్బన్, జనగాం, రంగారెడ్డి కలెక్టరేట్లు దసరా నాటికి పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మిగతా కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
'సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి'
నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణ పురోగతిపై ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీకృత కలెక్టరేట్ భవనాలు వెంటనే పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆగస్టు 15న సిద్దిపేట కలెక్టరేట్‌ను ప్రారంభించే అవకాశముందని.. ఆలోపు దానికి సంబంధించిన పనులను పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ముంగిటకే పాలన వెళ్లాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలున్న తెలంగాణలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి మొత్తం 33 జిల్లాల తెలంగాణగా చేశారన్నారు. అలా ఏర్పడిన జిల్లాలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఫలాలు ఒకే గొడుగు కింద అందాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు అక్కడి నుంచే పనిచేసే విధంగా.. ప్రజలు వారి పనుల నిమిత్తం అక్కడా, ఇక్కడా తిరగకుండా ఒకే చోట వారి పనులు పూర్తి చేసుకునేలా ఈ కార్యాలయాలు పనిచేస్తాయన్నారు.
ఇవీ చూడండి: కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ.. బయోటెక్ రంగం బలోపేతానికి సూచనలు