తెలంగాణ పచ్చగా ఉండాలని.. ప్రకృతిని సంరక్షించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.
గచ్చిబౌలిలో రెండెకరాల్లో హరితహారం.. పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ స్పందించి హరితహారంలో పాల్గొంటున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలో రెండు ఎకరాల్లో మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.
'గచ్చిబౌలిలోని రెండు ఎకరాల్లో మొక్కలు నాటడం జరుగుతోంది'
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ స్పందించి హరితహారంలో పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. గచ్చిబౌలిలోని రెండు ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్