Minister Prashanth Reddy: దేశ రైతాంగం కేసీఆర్ కోసం ఎదురు చూస్తోందని రాష్ట్ర ఆర్ అండ్ బీ, శాసనవ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రశాంత్ రెడ్డి లేఖ విడుదల చేశారు. పండగ పూట ఎరువుల ధరలను పెంచి దేశానికి అన్నం పెట్టే రైతులను గోస పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
Minister Prashanth Reddy: 'దేశ రైతాంగం కేసీఆర్ కోసం ఎదురు చూస్తోంది'
Minister Prashanth Reddy: ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై భాజపా నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖను రాసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.....పండగ పూట ఎరువుల ధరలు పెంచుతారా? అని ప్రశ్నించారు.
Minister Prashanth Reddy: 'సీఎం కేసీఆర్ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి'
కేంద్ర ప్రభుత్వ విధానాలను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని డిమాండ్ చేశారు. ఎరువుల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర భాజపా నేతలు డిమాండ్ చేయాలన్నారు. రైతు ప్రయోజనాలపై ప్రగల్భాలు పలుకుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్న స్థానిక భాజపా నాయకులను ప్రశ్నించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి: